Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా ఏపీ సీఎం జగన్ కొనసాగేలా పార్టీ నిబంధనలను మార్చుకున్న అంశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ స్పందించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29-ఏ ప్రకారం అది చెల్లుబాటు అవకాశం లేదని పేర్కొన్నారు. ఆ చట్టం ప్రకారం భారత ఎన్నికల సంఘం గుర్తింపు ఉండి, ఎన్నికల గుర్తు కూడా ఉన్న ఏ పార్టీలో అయినా అంతర్గత ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రక్రియ ఉండాలనే నిబంధన ఉందని తెలిపారు.
ఆ చట్టం నిబంధల ప్రకారం రెండేండ్ల్లకో... మూడేండ్లకో పార్టీలోనూ అంతర్గత ఎన్నికలు నిర్వహించి అధ్యక్షులతో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చాలా కాలం ఇలా వ్యవహరించపోతే ఎన్నికల సంఘం నోటీసులు కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.