Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈనెల 21 నుంచి నియోజకవర్గాల్లో బైకుర్యాలీలు : తరుణ్‌చుగ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ చేపట్టనున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఆగస్టు రెండో తేదీ నుంచి ప్రారంభమై 20 రోజుల పాటు కొనసాగుతుందని ఆపార్టీ తెలంగాణ ఇన్చార్జి తరుణ్‌చుగ్ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజరుకుమార్, మాపీ ఎంపీ రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సన్నాల శ్రీరాములు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శృతిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. యాత్ర పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. అట్లాగే పోడు భూములు, ధరణి సమస్యలపై సోమవారం నాడు కరీంనగర్లో బండి సంజరు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 'మౌన దీక్ష' చేపడతారని తెలిపారు. ఈ నెల 21 నుంచి పల్లెగోస-బీజేపీ భరోసా పేరిట అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలో బైకుర్యాలీలు నిర్వహించనున్నామని ప్రకటించారు. బండి సంజరు ఆధ్వర్యంలో దాదాపు 30 మంది సీనియర్ నేతలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బైక్ ర్యాలీలు నిర్వహిస్తారనీ, రాత్రి పూట పల్లెల్లోనే బస చేస్తారని తెలిపారు. ఆజాదీ కా అమృతోత్సవ్ నేపథ్యంలో ఆగస్టు 9 నుండి 15 వరకు ప్రతి బీజేపీ కార్యకర్త తమ నివాసాలపై జాతీయ జెండాను ఎగరేయాలని పిలుపునిచ్చారు. నర్సంపేట నియోజకవర్గానికి చెందిన పలువురు టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు. బండి సంజరు అధ్యక్షతన ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ వైఫల్యాలపై అధ్యయన, కోర్, చేరికల కమిటీల సమావేశాలు జరిగాయి.
బండికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పలువురు నేతలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరు కుమార్‌కు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీ ఇంద్రసేనారెడ్డి, జాతీయ నాయకులు డీకే అరుణ, మురళీధర్‌రావు, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వివేక్, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బంగారు శృతి, కోశాధికారి శాంతికుమార్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాసులు, నేతలు గరికపాటి మోహన్‌రావు, దుగ్యాల ప్రదీప్, తదితరులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.