Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
శివసేన పార్టీలో ఉన్నట్టే తమ పార్టీలోనూ ఏక్నాథ్ షిండేలున్నారనే భయం కేసీఆర్‌కు పట్టుకున్నదనీ, అందుకే నిత్యం షిండే పేరును తలుసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరుకుమార్ అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడారు. దేశంలో ఏ పట్టూ లేనిది ఊరికే 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందా? అని ప్రశ్నించారు. మోడీ రోజుకు 18 గంటలకు పనిచేస్తే కేసీఆర్ నిత్యం ఫామ్‌హౌజ్‌లోనే ఉంటాడని విమర్శించారు. ఫామ్‌హౌజ్ సీఎం దేశ్‌కీ నేత ఎట్ట అవుతారని ప్రశ్నించారు. ప్రధానిని కించపరిచేలా ఓ సీఎం మాట్లాడటం సరిగాదన్నారు. ఇస్తాంబుల్, లండన్, న్యూయార్క్ ఏమయ్యాయి కేసీఆర్? అని ప్రశ్నించారు. వరదలతో అల్లాడుతున్న ప్రజలు నిలదీస్తారనే విషయాన్ని దారిమళ్లించేందుకు కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టారని విమర్శించారు. అధికారాన్ని విసిరికొడతవా? చెప్పుతో సమానమంటావా? ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఇందుకేనా? అని ప్రశ్నించారు. దేశంలోని ప్రాజెక్టుల గురించి కాదు...దమ్ముంటే ముందు నువ్వు నెట్టెంపాడు, కోయిల్ సాగర్, డిండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు ఎంతవరకు వచ్చాయో చెప్పు అని నిలదీశారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పక్కపార్టీల్లోకి పోవాలని చూస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. విజరు మాల్యా, నీరవ్ మోడీలకు చెందిన రూ.19,111 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందనీ, రూ.15 వేల 114 కోట్లను వాళ్లు చెల్లించి మిగతాదీ కడతామని బతిమిలాడుతున్నారని చెప్పారు. కేసీఆర్ చేయిస్తున్న సర్వేలన్నింటిలోనూ టీఆర్ఎస్కు ప్రతికూల పవనాలు వీస్తున్నాయన్నారు.