Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వామపక్ష విద్యార్థి సంఘాల వెల్లడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వర్షాల నేపథ్యంలో 14న నిర్వహించే రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్ కార్యక్రమాన్ని వాయిదా వేసి ఈ నెల 20న నిర్వహిస్తామని వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశా లల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణం కాగా, రాష్ట్ర ప్రభుత్వం వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో పాఠశాల బంద్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీయస్యూ, ఏఐడీఎస్ఓ, పీడీయ స్యూ, ఏఐఎస్బీ, ఏఐపీఎస్యు,ఏఐఎఫ్డీఎస్ సంఘాలు ప్రకటించాయి.