Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
క్షుద్ర రాజకీయాలతోనే బీజేపీ బతుకుతున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఆ పార్టీ నాయకులు ఎప్పుడేం మాట్లాడుతారో, ఎందుకు మాట్లాడుతారో వారికే తెల్వదని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ లేవనెత్తిన ఏ ఒక్క ప్రశ్నకు బదులివ్వకుండా, అర్థంపర్థం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారని తెలిపారు. వీళ్లకు క్షుద్ర రాజకీయాలు చేయడం తప్ప, రాష్ట్ర బాగోగుల గురించి ఏ మాత్రం పట్టింపు లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి కూడా తెచ్చే తెలివి వారికి లేదని ఎద్దేవా చేశారు. తమకు గిట్టని నాయకులపై ఐటీి, ఈడీ, ఐబీ, సీబీఐలను ప్రయోగించి భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకుంటున్నారని ఆరోపించారు.