Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి ప్రాంతంలో కోవిడ్ వ్యాప్తి చాలా నెమ్మదిగా ఉందనీ, దాని నివారణకు అర్హులైనవారందరికీ బూస్టర్‌డోస్‌లు ఇవ్వాలని ఆ సంస్థ డైరెక్టర్(పర్సనల్, ఫైనాన్స్, పి అండ్‌పి) ఎన్.బలరామ్ అధికారులను ఆదేశించారు. అయినా అన్ని డిస్పెన్సరీల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అవసరమైన ఔషధాలు, మాస్కులు, శానిటైజర్లు, ఆక్సిజన్ వంటివి సమకూర్చు కొని సిద్ధంగా ఉండాలని ఆయా ఏరియాల జనరల్ మేనేజర్లకు సూచించారు.సోమవారంనాడాయన కోవిడ్‌పై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.ప్రస్తుతం సింగరేణి వ్యాప్తంగా 60కోవిడ్ కేసులు నమోద య్యాయని, ఒకవేళ వీటి సంఖ్య పెరిగినప్పటికీ కంపెనీ ఆస్పత్రుల్లోనే తగిన వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మొదటి రెండు డోసులు తీసుకున్న కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు బూస్టర్ డోస్‌ను వెంటనే వేయాలని ఆదేశించారు. డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలకోట య్య ప్రస్తుతం కంపెనీ వద్ద ఉన్న కోవిడ్ నివారణ వైద్య సదుపాయాలు, మందులు తదితర వివరాలను వెల్లడించారు. సమావేశంలో హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఎస్వో టు డైరెక్టర్(పి అండ్ పి) రవి ప్రసాద్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాస్కర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పూర్ణచందర్ రావు, కార్పొరేట్ ఆఫీస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటేశ్వ రరావు, జీఎం(పర్సనల్), ఐఆర్, పీఎం ఎ.ఆనందరావు పాల్గొన్నారు.