Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పెరిగిన గిరిజన జనాభాకు తగినట్టు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లను కూడా పెంచాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన అఖిల భారత బంజారా సదస్సులో ఆయన ప్రసంగించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతానని హామీ ఇచ్చారు. నూతనంగా ఏర్పాటు చేసిన గిరిజన గ్రామ పంచాయతీలకు మౌలిక సదుపాయాలు, నిధుల కోసం గిరిజనులు. ఆదివాసీలతో కలిసి పోరాటం చేస్తానని తెలిపారు. పోడు భూముల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమానుష వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. గిరిజ నులకు మూడెకరాలు, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామన్న హామీలను కేసీఆర్ మరిచిపోవడంపట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అధ్యక్షత వహించగా, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, కర్ణాటక ఎంపీ ఉమేష్ జాదవ్, 15 రాష్ట్రాల బంజారా సంఘం నాయకులు పాల్గొన్నారు.