Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో లేవనెత్తిన విషయాలపై మాట్లాడకుండా బీజేపీ నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్ ,కాలేరు వెంకటేష్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ, అసలు విషయాలను బీజేపీ నాయకులు పక్కన పెట్టారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి గురించి ప్రతి రోజు పేపర్లలో చదువుతున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ గద్ద దిగాలని దేశం కోరుకుంటున్నదని చెప్పారు. ఉద్యోగులకు జీతాలివ్వడం లేదంటూ బండి సంజరు రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు ప్రధాని మోడీకి శ్రీలంక అధ్యక్షునికి పట్టిన గతి పట్టకుండా చూసుకోవాలని బీజేపీ నేతలకు హితవు పలికారు.