Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త సంచలనం సృష్టించి.. విజయ పథంలో శరవేగంతో పయనిస్తున్న ప్రఖ్యాత సంస్థ '' సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్'' 16వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం విజయవాడ నగరంలోని 'మురళి రిసార్ట్స్'లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ .. 2006వ సంవత్సరంలో ఓ సాధారణ రియల్ ఎస్టేట్ సంస్థగా తమ సంస్థను ప్రారంభించామనీ, కస్టమర్ల ఆదరాభిమానాలు, ఆశీస్సులతో చక్కని అభివృద్ధిని సాధించామని అన్నారు. 2017లో ఓ వినూత్న ఆలోచనతో ఎర్రచందనం ప్లాంటేషన్ రంగంలోకి ప్రవేశించా మనీ, కస్టమర్ల ఆదరాభిమానాలే సోపానాలుగా ఈ నూతన రంగంలో కూడా అభివృద్ధి పథంలో పయనిస్తున్నామని తెలిపారు. కేవలం ఐదేళ్ల లో 1500 ఎకరాలలో 15 వెంచర్లు చేపట్టి.. విజయవంతంగా పూర్తి చేయడం.. 6 లక్షలకు పైగా నాటబడిన ఎర్రచందనం మొక్కలు.. 4 వేల మందికిపైగా ఉన్న సంతోషకరమైన కస్టమర్లే తమ సంస్థ అభివృద్ధికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఎర్ర చందనంతో చేసే బొమ్మలకు , ఎర్రచందనం పౌడరుకు, ఆయిల్‌కు, ఎర్రచందనం ఒక భాగంగా ఉండే ప్రతి ఉత్పత్తికీ.. ప్రపంచ దేశాలలో.. ముఖ్యంగా ఆసి యా దేశాలలో అమితమైన డిమాండ్ ఉందని, ఈ డిమాండ్ కస్టమర్ల కు కాసుల వర్షం కురిపిస్తుందనీ, ప్రజలంతా ఈ వాస్తవాలను గ్రహిం చాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఎర్రచందనం మొక్కలతో కూడిన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వారి ఓ ప్లాట్‌ని వెంటనే కొను గోలు చేసి.. తమ బంగారు భవితకు బాటలు వేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. చట్టబద్ధమైన రీతిలో ఎర్ర చందనం సాగు విక్రయాన్ని చేపట్టి.. ఈ తరహా వ్యాపార విధానాన్ని ప్రపంచానికి మొదటిసారిగా పరిచయం చేసిన అరుదైన ఘనత తమ సొంతమని వివరించారు. అనంతరం సంస్థ అభివృద్ధికి నిరంతరంగా శ్రమించి, సంస్థ విజయపథానికి బాటలు వేసిన సంస్థ ఉద్యోగులకు మరియు మార్కెటింగ్ సిబ్బందికి ఆయన అవార్డులను, సర్టిఫికేట్లను అందజేశారు. ఈ వేడుకల్లో డ్యాన్సర్లు నృత్య ప్రదర్శనతో ఆకట్టుకోగా, గాయకుడు కృష్ణ చైతన్య తన గీతాలాపనతో ఆహూతులను అలరించారు.ప్రముఖ యాంకర్ సుమ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.