Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కబ్జాకు గురైన భూమిని కాపాడి
- పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్
నవ తెలంగాణ వికారాబాద్ ప్రతినిధి
వికారాబాద్ జిల్లా పరిగి మండలం,రంగాపూర్ గ్రామంలో సర్వేనెంబర్ 18లో, విస్తీర్ణం 9.39గుంటల ప్రభుత్వ భూమిని పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సోమవారం సీపీఐ(ఎం), వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్ స్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. రెండు గంటల పాటు వర్షంలోనే తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్ రాములు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీశ్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పి. మల్లేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. వెంకటయ్య మాట్లాడుతూ... రంగాపూర్ గ్రామంలో సర్వే నంబరు 18 విస్తీర్ణం 9.39 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది భూ కబ్జాదారులు కబ్జా చేస్తే అధికారులు చూసి చూడనట్టు ఉండడం, కబ్జాదారులకు అనుకూలంగా మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వ భూమి ప్రయివేట్ వ్యక్తుల చేతిలో ఏ రకంగా ఉంటుందో అ తాసిల్దార్ సమాధానం చెప్పాలన్నారు. ఆ కబ్జా నుంచి వెంటనే కబ్జాదారులను పంపించాలని ఎమ్మార్వోను గట్టిగా నిలదీశారు. కబ్జా నుంచి కబ్జాదారులను వెళ్ళగొడతామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.