Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ఇండియా చాలెంజ్‌ను రైతుబంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వీకరించారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోశ్‌కుమార్ పిలుపు మేరకు చాలెంజ్‌ను స్వీకరించి సోమవారం హైదరాబాద్‌లోని నాంపల్లిలో గల రైతు బంధు సమితి కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ హరిత తెలంగాణ స్వప్నం సాకారం దిశగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆ కార్యక్రమం ద్వారా రాష్ట్రం పచ్చని తెలంగాణ దిశగా ముందుకు వెళ్తున్నదనీ, ఈ విషయంలో దేశానికే మార్గదర్శిగా నిలుస్తున్నదని చెప్పారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.