Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తక్షణం హక్కు పత్రాలివ్వాలి: తెలంగాణ గిరిజన సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు రైతులకు హక్కు పత్రాలివ్వకుండా అధికారులు దాడులు చేయటం అమానుషమని తెలంగాణ గిరిజన సంఘం(టీజీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరాంనాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని టీజీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మానాయక్ అధ్యక్షతన సోమవారం రాష్ట్ర కమిటి సమావేశం జరిగింది. పోడు భూముల పట్ల ప్రభుత్వం అనుసరి స్తున్న విధానం, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించినట్టు వారు తెలిపారు. పోడు సాగుదారులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తే యాలని డిమాండ్ చేశారు. గిరిజనులపై పోలీసులు, అటవీ అధికారుల దాడులు నిత్యకృత్యమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు సాగు చేస్తున్న అటవీ పోడు భూము లకు హక్కు పత్రాలు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదని తెలి పారు. గత ఏడాది నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు తీసుకున్న టువంటి దరఖాస్తులను ఇప్పటి వరకు ఎందుకు పరిశీలన చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమ, ఫారెస్ట్, రెవెన్యూ శాఖలు పరిశీలించి అర్హులైన వారికి పోడు హక్కు పత్రాలు ఇవ్వాలంటూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయాన్ని ఈ సంద ర్భంగా గుర్తుచేశారు. ఆరునెల్లయినప్పటికీ ఆ హామి అమలు కాకపోవ టానికి కారణాలు వెల్లడిం చాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావటంతో పోడు రైతులు విత్తనాలు వేసుకుంటున్నారనీ, వాటిని ధ్వంసం చేయటమేంటని ప్రశ్నించారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాద్యక్షులు డి. రవి నాయక్ , సహాయ కార్యదర్శి భూక్యా వీరభద్రం, ఎం. శంకర్, కే. శంకర్, ఆంగోత్ వెంకన్న, రెడ్యా తదితరులు పాల్గొన్నారు.