Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీ సేవా కమిషనర్ కు ఫిర్యాదులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అవినీతికి పాల్పడుతున్న ఈడీఎంపై చర్యలు తీసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ముగ్గురు బాధితులు మీ సేవా కమిషనర్ (ఈఎస్ డీ) వెంకటేశ్వర రావుకు ఫిర్యాదు చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ఆధార్ సెంటర్ నిర్వాహకులు శాంతన్న, హనుమన్నతో పాటు మరొకరు కమిషనర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశారు.
తాను 2017 నుంచి ఆధార్ సెంటర్‌ను ఎంపీడీఓ కార్యాలయంలో నడుపుకునేందుకు అనుమతి ఉందనీ, అయితే ఎంపీడీఓ స్థలం లేదని నిరాకరించినట్టు శాంతన్న తెలిపారు. అదే విషయాన్ని ఈడీఎంకు చెబితే తనకు సంబంధం లేదంటూ తన ఐడీని హౌల్డ్‌లో పెట్టి రూ.30 వేలు చెలిస్తే ఐడీ బ్లాక్ కాకుండా చూసుకుంటాననీ, తాను అధికారులకు ఇచ్చుకోవాలని చెబుతున్నారని ఫిర్యాదు చేశారు. అదే విధంగా హనుమన్న ఫిర్యాదులో... ప్రతి ఆధార్‌కు రూ.10 కమిషన్ ఇవ్వకపోవడంతో ఐడీని బ్లాక్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి యాక్టివేట్ చేసేందుకు రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. తగిన కారణం లేకుండా సెంటర్ ఐడీని బ్లాక్ చేసినందున ఈడీఎంపై చర్యలు తీసుకోవాలని కోరారు.