Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్‌సౌధలో ఇంజినీర్స్డే వేడుకలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నిజాం హయాంలో చీఫ్ ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వహించిన మీర్ అహ్మద్ అలీ నవాబ్ జంగ్ బహద్దూర్ సేవలు అజరామరమైనవని టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు అన్నారు. ఆయన హయాంలో హైదరాబాద్ సంస్థానంలో అద్వితీయ చారిత్రక నిర్మాణాలు జరిగాయని చెప్పారు. ఉస్మాన్‌సాగర్, నిజాంసాగర్, హిమాయత్‌సాగర్, అలీ సాగర్ వంటి అనేక ప్రజోకయోగమైన, చెక్కుచెదరని నిర్మాణాలు జరిగాయని వివరించారు. నవాబ్ అలీ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం విద్యుత్‌సౌధలో తెలంగాణ ఇంజినీర్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభాకరరావు ముఖ్యఅతిధిగా హాజరై నవాబ్ అలీ సేవల్ని కొనియాడారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ శివాజీ మాట్లాడుతూ నవాబ్ అలీ స్ఫూర్తితో విద్యుత్ ఇంజినీర్లు పనిచేస్తూ, ప్రజలకు మెరుగైన సేవల్ని అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో టీఈఈఏ ప్రధాన కార్యదర్శి ఏ రామేశ్వరశెట్టి, ఇంజినీర్లు ఏ సరస్వతి, శ్రవణ్కుమార్గుప్తా, లక్ష్మయ్య, తిరుపతయ్య, పున్నానాయక్ తదితరులు పాల్గొన్నారు.