Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఈఐలో ఘనంగా ఇంజినీర్స్ డే వేడుకలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశంలో నెలకొల్పే మౌలిక సదుపాయాలు అభివృద్ధికి సూచికలుగా నిలుస్తాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఆర్బిట్రేటర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్రాల చైర్మెన్ డాక్టర్ శ్రీధర్ మోతే అన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) తెలంగాణ కేంద్రం ఆధ్వర్యంలో నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహద్దూర్ 145వ పుట్టినరోజును పురస్కరించుకొని 9వ తెలంగాణ ఇంజినీర్స్ డే ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా 'భారతదేశంలో మౌలిక సౌకర్యాల వృద్ధి-సవాళ్లు' అంశంపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా హాజరై, ప్రసంగించారు. రోడ్లు, రైలు రవాణా, మెట్రోలు, పోర్టులు, విద్యుతÊ కమ్యూనికేషన్స్, ఎయిర్‌పోర్టులు, భవనాలు వంటి మౌలిక సౌకర్యాలు దేశ ఆర్థికాభివృద్ధిని పరిపుష్టం చేస్తాయన్నారు. దేశంలో అతిపెద్ద ఉపాధి అవకాశాలు భవన నిర్మాణ రంగంలోనే ఉన్నాయనీ, దీనిపై 3.5 కోట్ల మంది ప్రజలు ఆధారపడి ఉన్నారని వివరించారు. నిర్మాణరంగానికి అవసరమైన సామాగ్రిని 250కి పైగా పరిశ్రమలు ఉత్పత్తి చేస్తున్నాయని తెలిపారు. భవిష్యత్ మౌలిక సౌకర్యాల అభివృద్ధి ప్రణాళికలు కూడా ప్రభుత్వంతో పాటు ప్రయివేటురంగంలోనూ ఉన్నాయని తెలిపారు. వచ్చే ఐదేండ్లలో సౌకర్యాల కల్పన మరింత వేగవంతం అవుతుందన్నారు. దీనికోసం ఎదురయ్యే సవాళ్లను స్వీకరించడానికి నిర్మాణరంగం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని ఉదహరించారు.