Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 నుంచి ఎంసెట్ యథాతధం
- ఉన్నత విద్యామండలి చైర్మెన్ లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాల కారణంగా బుధవారం నిర్వహించే ఈసెట్ను వాయిదా వేస్తున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈనెల 11 నుంచి 13 వరకు మూడురోజులపాటు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకూ ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్, జేఎన్టీయూహెచ్ వీసీ, ఎంసెట్, ఈసెట్ కన్వీనర్లు, ఇతర సీనియర్ అధికారులతో ఉన్నత విద్యామండలి చైర్మెన్ లింబాద్రి సోమవారం సమావేశం నిర్వహించారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. బీటెక్, బీఈ, బీ ఫార్మసీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో లాటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాల కోసం ఈనెల 13న (బుధవారం) నిర్వహించే ఈసెట్ రాతపరీక్ష నిర్వహణను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.