Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జెఈఈ -మెయిన్ 2022) ఫలితాల్లో దేశ వ్యాప్తంగా 14 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా, వారిలో నలుగురు నారాయణ విద్యార్థులు 100 పర్సం టైల్ స్కోర్‌తో రికార్డ్ సృష్టించారు. కె. ధీరజ్(హెచ్.టి. నెం. 220310 178049),అనికేత్ ఛటోపధ్యాయ(హెచ్.టి.నెం. 220310283661 ), బోయ హరేన్ కార్తీక్ (హెచ్.టి.నెం. 220310299448), రూపేష్ బియాని (హెచ్.టి.నెం. 220310176916) వీరందరూ స్కూల్ స్థా యి నుండి నారాయణలోనే చదవటం గమనార్హం. దక్షిణ భారత దేశం నుండి మరి ఏ ఇతర విద్యాసంస్థ ఈ అరుదైన ఘనతను సాధించలేదని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డా|| పి. సింధూర, పి. శరణి తెలి యజేశారు. బాలుర విభాగంలో నలుగురు, ఈ .డబ్ల్యూ. ఎస్. కేటగిరీ లో ఒకరు నారాయణ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కన బరిచినట్లు చెప్పారు. అలాగే 63 మంది విద్యార్థులు వివిధ సబ్జెక్టుల్లో 100 పర్సం టైల్ స్కోర్ సాధించి నారాయణ విజయపరంపరను కొనసాగించారని అన్నారు. మరో విడత జరగనున్న జెఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్‌లోనూ అత్యధిక సంఖ్యలో నారాయణ విద్యార్థులు విజయభేరి మోగించనున్నా రని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆన్లైన్ ఎగ్జామ్స్ కోసం ప్రత్యేకం గా రూపుదిద్దిన ఎన్-లెర్న్ యాప్ ద్వారానే ఈ విజయం సాధ్య పడిందని తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించబడే జెఈఈ- మెయిన్ పరీక్షకు నారాయణ అందిస్తున్న అనితరసాధ్యమైన శిక్షణ, రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్‌లు, పటిష్ట ప్రణాళిక, స్టడీ మెటీరియల్ మరియు నిబద్ధతతో కూడిన వారాంతపు పరీక్షల వల్లనే ఈ ఘనత సాధ్యమైందన్నారు. ఆన్లైన్ ఎగ్జామ్స్ కోసం ప్రత్యేకంగా ఎన్-లెర్న్ యాప్‌ను రూపొందించటం జరిగిందని తెలిపారు.