Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణను సీఎం కేసీఆర్ శనిలా పట్టుకున్నాడనీ, దానిని వదిలించటమే లక్ష్యంగా పనిచేస్తానని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. చివరకు ఆయనకు బొందపెట్టేది కూడా తానేనని వ్యాఖ్యానించాడు. సోమవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.కేసీఆర్ చెప్పే మాటలకు చేసే చేతలకు అస్సలు పొంతన ఉండదని విమర్శించారు.బానిసలుగా పడి ఉండేవారంటేనే ఆయనకు నచ్చుతుందనీ, అలా నడుచుకోలేదనే తనపై కక్ష కట్టారని తెలిపారు. తెలంగాణ సమాజం, తన తల్లి సంస్కారాన్నీ, సహనాన్ని నేర్పాయనీ, హుజూరాబాద్ ప్రజలు ధైర్యాన్ని ఇచ్చారని చెప్పారు. అసెంబ్లీలో తన ముఖం కన్పించకుండా ఉండేందుకు రూ.600 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. పోలీసులు లేకుండా రావాలన్న తన భార్య జమున సవాల్తోనే కేసీఆర్ మానసికంగా చనిపోయారన్నారు. రాష్ట్రంలో 50 శాతమున్న బీసీలకు మూడు మంత్రి పదవులేనా? అని ప్రశ్నించారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
డిప్రెషన్లో సీఎం కేసీఆర్ : ఎంపీ కె.లక్ష్మణ్
రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో సీఎం కేసీఆర్ డిప్రెషన్లోకి వెళ్లిపోయారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ అన్నారు.సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను తాను రాజ్యసభకు ఎన్నికైతే సీఎం కేసీఆర్కు ఈర్ష్య ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రజలు భావిస్తున్నారన్నారు.హైదరాబాద్ డ్రగ్ మాఫియాగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.దేశంలో పుత్రవాత్సల్య పార్టీలన్నీ పతనమైపోయాయని గుర్తుచేశారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని చెప్పారు. దళితున్ని సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పలేదా అని ప్రశ్నించారు. ఆదివాసీ బిడ్డకు రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చిన మోడీ ఎక్కడీ పోడు భూముల గురించి వారిపై దాడులు చేయిస్తున్న మీరెక్కడ అని నిలదీశారు.