Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డాటా, అనలిటిక్స్ రంగంలో ప్రపంచంలో అగ్రగామిగా పేరుగాంచిన ఎక్స్పీరియన్ సంస్థ తన కార్యకలాపాలను హైదరాబాద్ విస్తరించేందుకు నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఎక్స్ పీరియన్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ ఇండియా కంట్రీ మేనేజర్ నీరజ్ ధావన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ నూతన ఆవిష్కరణలకు, సాంకేతికతకు కేంద్రంగా మారిందని తెలిపారు. ఆధునిక మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులతో నగరం ప్రపంచ గ్లోబల్ హబ్‌గా మారిందన్నారు. నీరజ్ ధావన్ మాట్లాడుతూ, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించేందు కు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని చెప్పారు.