Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నైట్‌ఫ్రాంక్ ఇండియా వెల్లడి
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ప్రస్తుత ఏడాది జూన్‌లో 5,408 నివాస గృహాల రిజిస్ట్రేషన్లు జరిగాయని నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. వీటి విలువ రూ.2,841 కోట్లుగా ఉందని తెలిపింది. ఇందులో 53 శాతం గృహాల విలువ రూ.25-50 లక్షల మధ్య ఉందని పేర్కొంది. 1000-2000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గృహాల వాటా 71 శాతంగా ఉందని తెలిపింది. కాగా.. 2022 జూన్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో మొత్తంగా రూ.8,700కోట్ల విలువ చేసే 17,074 నివాసాల అమ్మకాలు జరిగాయని వెల్లడించింది. ఏడాదికేడాదితో పోల్చితే 9 శాతం ధరలు పెరిగాయని తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి పరిధిలోని రిజిస్ట్రేషన్లను ఇందులో పరిగణలోకి తీసుకుంది.