Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు విశ్వబ్రాహ్మణుల వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విశ్వబ్రాహ్మణులను ఆదుకునేందుకు సీఎం మంజూరు చేసిన రూ.250 కోట్లలో మిగిలిన నిధులను కూడా విడుదల చేయాలని తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనం, వెల్ఫేర్ ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ట్రస్ట్ చైర్మెన్ లాలుకోట వేంకటాచారి, కార్యదర్శి బొండుపల్లి సుందర్, కోశాధికారి రాగిఫణి రవీంద్రాచారి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంజూరు చేసిన నిధుల్లో కేవలం26.94 కోట్లను 5,201 మందికి విడుదల చేశారని తెలిపారు. మిగతా నిధులను విశ్వబ్రాహ్మణ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా విడుదల చేయాల్సి ఉందని పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా విశ్వబ్రాహ్మణుల కోసం ఆత్మగౌరవ భవనం కోసం ఉప్పల్ బగాయత్లో ఐదెకరాల స్థలం కేటాయించారని వివరించారు.నిర్మాణ ఖర్చులకు రూ.ఐదు కోట్లు కేటాయించారని, తెలంగాణ తొలి శాసనసభాపతిగా మధుసూదనాచారిని నియమించారని తెలిపారు.