Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికుట్రలు పన్నినా మమ్మల్ని అడ్డుకోలేవు : బండి సంజయ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్ ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి వర్షాలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజానీకాన్ని ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్ సూచించారు. మూడేండ్లలో తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ ఆరు నుంచి 30 శాతానికిపైగా పెరిగిందన్నారు. ఇంకా 8 శాతం ఓట్బ్యాంక్ను పెంచుకుంటే తెలంగాణలో అధికారం తమదేనన్నారు. చావుబతుకుల మధ్య ఉన్న కాంగ్రెస్‌ను తట్టిలేపేందుకు కేసీఆర్ సహకరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పోటీచేసే అవకాశం ఉందంటూ కాంగ్రెస్ నేతలే చెబుతున్నారని ఉటంకించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేసినా బీజేపీ గెలుపును అడ్డుకోలేవన్నారు. ఒప్పందం ప్రకారమే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఒకే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతునిస్తున్నాయని చెప్పారు. మీడియా దృష్టిని మరల్చేందుకు మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర రోజే సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ బహిరంగసభను పెడుతున్నదని ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి మహిపాల్ రెడ్డి, లోక్ సత్తా నాయకులు వెంకటరమణ, తదితరులు బండి సంజయ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.