Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఇంటర్మీడియెట్ కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరానికి ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును ఈనెల 17 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకులు ఉషారాణి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులను ఈనెల 17 వరకు స్వీకరిస్తామని తెలిపారు.