Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫీజు చెల్లింపు గడువు ఆగస్టు 14
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ ప్రవేశాలను చేపట్టనున్నట్టు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) డైరెక్టర్ పివి శ్రీహరి బుధవారం షెడ్యూల్ను విడుదల చేశారు. సామాజిక, ఆర్థిక, ఇతర కారణాలతో చదువుకోలేకపోయిన వారికి ఈ అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రవేశాల కోసం ఫీజు చెల్లింపు ప్రక్రియ ఈనెల 18 నుంచి ప్రారంభమవుతుందని వివరించారు. ఫీజు చెల్లింపు గడువు వచ్చేనెల 14 వరకు ఉందని తెలిపారు.