Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుకు రాజీవ్ నిదర్శనం : కవిత
- తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మెన్‌గా సాగర్ మేడె బాధ్యతల స్వీకరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మెన్‌గా మేడె రాజీవ్ సాగర్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో జరిగిన కార్య క్రమంలో పలువురు ప్రముఖుల సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, ఉద్యమ కాలం నుంచి రాజీవ్ సాగర్ కష్టపడ్డారని గుర్తుచేశారు. సమాజం కోసం పని చేసే వారికి గుర్తింపు తప్పకుండా లభిస్తుందనేందుకు ఆయనే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు. ఈ గుర్తింపు తెలంగాణ జాగృతి కార్యకర్తలకు, ఉద్యమంలో పని చేసిన యువతకు స్ఫూర్తినిస్తుందని అభిప్రాయపడ్డారు. ఉద్యమ నాయకులు, సీఎం కేసీఆర్ పాలనలో గత ఎనిమిదేండ్లలో తెలంగాణ ఎంతో ప్రగతిని సాధించిందని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారనీ, అలాంటి వారిని ఎదుర్కొనే సత్తా కేసీఆర్‌కే సాధ్యమని చెప్పారు. ఓట్ల రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడే సైద్ధాంతిక రాజకీయాలు చేయాలని ఆమె హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఆర్టీసీ చైర్మెన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, విప్ గొంగడి సునీత , ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, ప్రకాష్ గౌడ్, జీవన్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, ముఠా గోపాల్, శానంపుడి సైది రెడ్డి, భాస్కర్ రావు , స్టీఫెన్సన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్ రావు, విజీ గౌడ్, ప్రభాకర్, రఘోత్తం రెడ్డి, ఆయా కార్పొరేషన్ల చైర్మెన్లు గజ్జెల నగేష్, సతీష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, దుడిమెట్ల బాలరాజ్, వాసుదేవ్ రెడ్డి, సాయి చంద్, మంత్రి శ్రీదేవి, అయాచితం శ్రీధర్ , గజ్జల రామకష్ణ రెడ్డి, అనిల్ కుర్మాచలం, బీసీ కమిషన్ మెంబర్ కిషోర్ గౌడ్, వెంకటేశ్వర రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు పురాణం సతీష్, పూలరవీందర్ తదితరులు పాల్గొన్నారు.