Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 23న కలెక్టరేట్ల ముట్టడి
- 25 నుంచి సమ్మెకు సిద్ధం: వీఆర్ఏల సదస్సులో జేఏసీ రాష్ట్ర నాయకులు రాములు
నవతెలంగాణ-నల్లగొండ
వీఆర్ఏలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం పేస్కేల్ అమలు చేయకపోతే వీఆర్ఏల పోరాటాన్ని ఉధృతం చేస్తామని సంఘం జేఏసీ రాష్ట్ర నాయకులు వంగూరి రాములు, ఎం.రాజయ్య, రమేష్ బహదూర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 'వీఆర్ఏల సమస్యల పరిష్కారం- భవిష్యత్తు కార్యాచరణ' అంశంపై ఉమ్మడి నల్లగొండ జిల్లా సదస్సు స్థానిక రత్న ఫంక్షన్హాల్లో బుధవారం గంటకంపు శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించిన పేస్కేల్ అర్హత కలిగిన వారికి పదోన్నతులు కల్పించాలని, 55 ఏండ్లు పౖౖెబడిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఈనెల 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వరకు ఏ విధులకూ హాజరు కాబోమని స్పష్టం చేశారు. కార్యాలయాల టైపిస్ట్, డ్రైవర్, అటెండర్, వాచ్మెన్, స్వీపర్ మొదలగు వారితోపాటు వీఆర్ఏలు అందరూ పూర్తిస్థాయి సమ్మెలో ఉంటారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీఆర్ఏల డిమాండ్లు నెరవేర్చకపోతే ఈనెల 21, 22 తేదీల్లో కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు, 23న కలెక్టరేట్ ముట్టడి చేపడతామని చెప్పారు. అప్పటికీ స్పందించకపోతే ఈ నెల 25 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర నాయకులు మాధవ నాయుడు, గోవిందు, ఎస్.కె రఫీ, లక్ష్మల్ల నరసింహారావు, నల్లగొండ జిల్లా గౌరవాధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, ఉమ్మడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నార్ల శ్రీనివాస్ గంటకంపు శ్రీనివాస్, ఎడ్ల మల్లయ్య, ఎండీ జాంగిర్, జేఏసీ నాయకులు పాల్వాయి వెంకన్న, అక్కినపల్లి శ్రీనివాస్, పసుల రమేష్, దాసరి వీరన్న, వెంకటేష్, టి.సాల్మన్ కోరే గిరి, పెరుమాళ్ళ పిచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.