Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొగ్గు నిల్వలకు ఢోకా లేదు
- విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తత అవసరం
- భారీ వర్షాల్లోనూ విద్యుత్ సిబ్బంది పని హర్షణీయం
- సమీక్షా సమావేశంలో మంత్రి జీ జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారీ వర్షాల్లోనూ విద్యుత్ సరఫ రాకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ అన్ని చర్యలు తీసుకున్న దని ఆ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. ఎక్కడ ఏలాంటి సమస్యల ఎదురైనా విద్యుత్‌శాఖ సిబ్బంది తక్షణ ం అక్కడకు వెళ్లి సమస్యల పరిష్కా రానికి చొరవ తీసుకుంటున్నారని చెప్పారు. గడచిన వందేండ్లలో ఎన్న డూ పడనంత వర్షపాతం నమోదు అయినప్పటికీ,ి కనురెప్ప పాటు అంత రాయం లేకుండా సరఫరా అందించిన ఘనత రాష్ట్ర విద్యుత్ సంస్థలకే దక్కుతుందని అన్నారు. ఇలాంటి వర్షాలే గతంలో పడ్డప్పుడు విద్యుత్ శాఖా అతలాకుతలం అయిన విషయా లను ఆయన గుర్తుచేశారు. భారీ వర్షా ల దృష్ట్యా బుధవారం నాడిక్కడి విద్యుత్‌సౌధలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు, జేఎమ్డీ శ్రీనివాసరావు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సరిహద్దుల్లో సైనికుల్లా క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బంది పని చేస్తున్నారనీ, వారితో సీఎమ్డీలే స్వ యంగా సమన్వయం చేసుకోవడం వల్లే ప్రకృతి వైపరీత్యాలను సమర్థవం తంగా ఎదుర్కొగలుగుతున్నామన్నా రు. అలాగే రాష్ట్రంలో బొగ్గుకు ఎలాం టి కొరత లేదని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ముందస్తు నిల్వలు పెట్టుకున్నామనీ, నెల రోజుల కు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపారు. సింగరేణి ఓపెన్ కాస్ట్లో నీరు చేరడంతో రవాణా తదితర సమ స్యల వల్ల ఉత్పత్తి తగ్గినా, జెన్కోకు సరఫరా సజావుగానే సాగుతున్నద న్నారు. ప్రస్తుత వర్షాలతో ఇప్పటి వరకు 2,300 విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయనీ, వాటిలో ఇప్పటికే 1800 కుపైగా పునరుద్ధరించామని తెలిపా రు. ఎన్పీడీసీఎల్ పరిధిలో భూపాల పల్లి నియోజకవర్గం సర్వాయిపేట 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో మాత్రమే విద్యుత్ సరఫరా ఆగిందనీ, రెండు, మూడు రోజుల్లో దాన్ని పురుద్ధరిస్తా మన్నారు. అలాగే విద్యుత్ ప్రసారాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాల న్నారు. నిమ్ముతో తడిసిన గోడలు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.