Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రమేష్‌రెడ్డికి టీపీటీఎఫ్ నోటీసు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వైద్య విద్య సంచాలకుల కార్యాలయ అక్రమాలకు నిరసనగా ఈనెల 27న ధర్నా నిర్వహించనున్నట్టు తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు వైద్య విద్య సంచాలకులు రమేష్‌రెడ్డిని బుధవారం హైదరాబాద్‌లో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్, అదనపు ప్రధాన కార్యదర్శి పి నాగిరెడ్డి కలిసి ధర్నా నోటీసును సమర్పించారు. ఉపాధ్యాయులు, పింఛనర్ల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు మూడు నెలల నుంచి ఏడాదికిపైగా అపరిష్కృతంగా ఉంటున్నాయని తెలిపారు. అందుకు సంబంధించి ఆధారాలతో సహా వివరించారు. డీఎమ్ఈ సానుకూలంగా స్పందించారని తెలిపారు. బిల్లులను వరుస క్రమంలో పరిశీలన చేసి మంజూరయ్యేటట్టు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. వాటిని మంజూరు చేయకుంటే 27న డీఎమ్ఈ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు.