Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరీంనగర్‌కు చెందిన వర్షిత టాపర్
- 18 నుంచి పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సెలింగ్
- సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్స రంలో పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్) ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. పాలిసెట్‌కు 1,13,979 మంది దరఖాస్తు చేస్తే, 1,04,362 మంది అభ్యర్థులు రాతపరీక్షకు హాజరయ్యారని ఆయన వివరించారు. వారిలో 79,038 (75.73 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత పొందా రని చెప్పారు. పరీక్షకు హాజరైన వారిలో 56,392 మంది బాలురకు గాను 40,669 (72.12 శాతం) మంది అర్హత సాధించారని అన్నారు. 47,970 మంది బాలికలకుగాను 38,369 (79.99 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. పాలిసెట్‌లోనూ బాలికలే పైచేయి సా ధించారని వివరించారు. బాలురు కన్నా బాలికలు 7.87 శాతం అధికం గా ఉత్తీర్ణత పొందారని అన్నారు. పాలిసెట్‌లో కనీసం 30 శాతం అం టే 36 మార్కులొస్తేనే అర్హత సాధిస్తారని చెప్పారు. ఎస్సీ,ఎస్టీలు మా త్రం ఒక మార్కు సాధించినా అర్హులవుతారని అన్నారు. 19,027 మంది ఎస్సీలు పరీక్ష రాయగా, అందరికీ ర్యాంకులు కేటాయించామని వివరించారు. 9,738 మంది ఎస్టీలు పరీక్ష రాస్తే, వారందరూ ర్యాంకు లు పొందారని చెప్పారు. కరీంనగర్‌కు చెందిన గుజ్జుల వర్షిత 120కి 120 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారని అన్నారు. 119 మార్కు లతో సూర్యాపేటకు చెందిన చిత్తలూరి సాయిరోహిత్, సూరినేని భాను ప్రసాద్ రెండో ర్యాంకు, మేడ్చల్ మల్కాజిగిరికి చెందిన కల్లివరపు చంద్ర శేఖర్ నాలుగు, సూర్యా పేటకు చెందిన గజ్జి నాగరాజు, హైదరాబాద్‌కు చెందిన బానాల వసం తిలక్ష్మి ఐదో ర్యాంకు పొందారని వివరించారు. https://polycet.sbtet.telangana.gov.in https://polycetts.nic.in వెబ్సైట్ల ద్వారా ఫలితాలు చూడాలని కోరారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేఎస్టీఏయూ), శ్రీకొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం (ఎస్కేఎల్టీఎస్ హెచ్‌యూ), పివి నరసింహారావు తె లంగాణ పశుసంవర్ధక విశ్వవిద్యాలయం (పీవీఎన్ఆర్టీవీయూ)లో డి ప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రత్యేకంగా విడుదల చేస్తామన్నారు.
పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 18 నుంచి ప్రారంభమవుతుందని నవీన్ మిట్టల్ చెప్పారు. ఈ మేరకు షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఆన్లైన్లో ప్రాథమిక సమాచారం, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ వంటి ప్రక్రియను ఈనెల 18 నుంచి 22 వరకు చేపట్టాలని సూచించారు. ఈనెల 20 నుంచి 23 వరకు ధ్రువపత్రాల పత్రాల పరిశీలన నిర్వహిస్తామని తెలిపారు. 20 నుంచి 25 వరకు వెబ్ఆప్షన్లను నమోదు చేసేందుకు అవకాశముందని అన్నారు. ఈనెల 27న తొలివిడత సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. 27 నుంచి 31 వరకు ఫీజు చెల్లింపు, వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. వచ్చేనెల ఒకటి నుంచి తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. రెండున ధ్రువపత్రాల పరిశీలన, ఒకటి నుంచి మూడు వరకు వెబ్ఆప్షన్ల నమోదు ప్రక్రియను చేపట్టాలని కోరారు. ఆరున సీట్లు కేటాయిస్తా మన్నారు. ఆరు నుంచి పదో తేదీ వరకు ఫీజు చెల్లింపుతోపాటు వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. వచ్చేనెల ఎనిమిది నుంచి పది వరకు కేటాయించిన కాలేజీల్లో అభ్యర్థుల రిపోర్టు చేయాలని అన్నారు. అదేనెల ఎనిమిది నుంచి తరగతులు ప్రారంభ మవుతాయని వివరించారు. ఎనిమిదిన స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకా లను విడుదల చేస్తామని చెప్పారు. పూర్తి వివరాలకుhttps://polycet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి (ఎస్బీటీ ఈటీ) కార్యదర్శి, పాలిసెట్ కన్వీనర్ డాక్టర్ సి శ్రీనాథ్, సాంకేతిక విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ పుల్లయ్య, ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.