Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాజెక్టు భద్రతపై ఆందోళన
- ఎడమకాల్వకు గండి..18గేట్లు ఎత్తివేత
- ప్రాజెక్టు పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా
- గోడకూలి వ్యక్తి మృతి
- ప్రమాదకర స్థాయికి ప్రాజెక్టులు
- చెరువులకు గండ్లు
- గోదావరిఖని సింగరేణిలో లేఆఫ్
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి, కడెం/ విలేకరులు
ఎడతెగని వర్షం జన జీవనాన్ని స్తంభింపజేసింది. ప్రాజెక్టులు ప్రమాదకర స్థాయికి చేరుకోగా.. చెరువులకు గండ్లు పడ్డాయి. వరద నీరు లోతట్టు ప్రాంతాల్లో చేరింది. ఇండ్లను నీరు చుట్టుముట్టింది. రహదారులపై నుంచి వరద పెద్దఎత్తున ప్రవహిస్తుండటంతో రాకపోకలను బంద్ చేశారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు పెద్దఎత్తున వరద పోటెత్తడంతో ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఎగువ నుంచి భారీగా నీరు కడెం ప్రాజెక్టులోకి రావడంతో డ్యామ్ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాజెక్టులోకి 5 లక్షల క్యూసెక్కుల నీరు రావడం.. ఇందులో 3లక్షల క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తుండటం.. మరో 2లక్షల క్యూసెక్కులు ప్రాజెక్టులోనే నిల్వ ఉండటంతో అధికారుల్లోనూ ఆందోళన వ్యక్తమైంది. మొత్తం 18గేట్ల నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. మరోపక్క ఎడమ కాల్వ దగ్గర కట్టకు గండి పడటంతో అక్కడ్నుంచి కూడా భారీగా వరద బయ టకు వెళ్తోంది. ఓ దశలో డ్యామ్ తెగిపోతుందనే ప్రచారం జరిగింది. ఉమ్మడి జిల్లాతోపాటు పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కడెం ప్రాజెక్టు పరిస్థితిపై ఆరా తీశారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే రేఖానాయక్, జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీఫారుఖీ, జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ముంద స్తుగా ముంపునకు గురయ్యే 12 గ్రామాల ప్రజలను అప్ర మత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిం చారు.మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఎప్పటిప్పు డూ ప్రాజెక్టు పరి స్థితిపై ముఖ్యమంత్రికి వివరించినట్టు అధికారులు చెబు తున్నారు. ప్రమాద తీవ్రతను నివారిం చేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డ ఆర్ఎఫ్) బృందాలను రంగంలోకి దించేందుకు ప్రయ త్నాలు చేస్తున్నారు. దిగువ నీటి ఉధృతికి సమీపంలోని పాండ్వపూర్ వద్ద వంతెన తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ఆరు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పంట పొలాలు నీటిలోనే ఉండటంతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. లక్ష్మణచాంద మండలం వడ్యాల్లో వర్షం దాటికి గోడ కూలి చాకలి చిన్నన్న మృతిచెందారు. కెరమెరి మండలం అమ్మనమడుగు ప్రాజెక్టుకు వరద తీవ్రత పెరగడంతో సమీపంలోని కేస్లాగూడ వాసులను కొంత దూరంలోని పునరావాస కేంద్రానికి తరలించారు. ఆదిలా బాద్ రూరల్ మండలంలో వాగు పొంగడంతో జెండా గూడ గ్రామంలోకి నీళ్లు వచ్చాయి. వారిని సమీప పునరా వాస కేంద్రానికి తరలించారు. రోడ్లు, వంతెనలు తెగిపోవ డంతో అనేక గ్రామాలకు వారం రోజులుగా రాక పోకలు నిలిచిపోయాయి.నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కృష్ణ మండలంలోని కృష్ణానది తీర ప్రాంతంలోని ఘాట్ల వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
ఎస్సారెస్పీలోకి భారీగా వరద
ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టులోకి బుధవారం సాయంత్రం వరకు 4,18,960 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో సాగుతోంది. అదే స్థాయి లో ప్రాజెక్టులోని నీటిని గేట్లు ఎత్తి దిగువకు వదులు తున్నారు. ప్రాజెక్టు 34 గేట్లు ఎత్తి 4,50,024 క్యూసెక్కు ల నీటిని కిందకు వదిలారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 76 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్ నిజా మాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హంగర్గ గ్రామం లోకి ప్రవేశించాయి. బోధన్ ఎమ్మెల్యే ప్రాజెక్టు అధికారుల తో మాట్లాడి ఔట్‌ఫ్లో పెంచి జాగ్రత్తలు చేపట్టారు. మంజీరా పొంగిపోర్లుతోంది. మంజీరా ప్రవాహ ఉధృతికి సాలూరా బ్రిడ్జి మునిగింది. బ్రిడ్జిపై నుంచి నది ప్రవహి స్తోంది. మంజీరా ఉగ్రరూపంతో సాలూరా, ఖండ్గావ్, కందకుర్తి బ్రిడ్జిలపై రాకపోకలు నిలిపేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. బుధవారం 10,360 క్యూసెక్కుల మేర నీరు ప్రాజెక్టులోకి చేరింది.
జగిత్యాల జిల్లా కేంద్రం 11వ వార్డులో ధర్మ సము ద్రం చెరువుకు గండి పడింది. అమీనాబాద్ యువకులు 50మంది మున్సిపల్ సిబ్బందితో కలిసి గండికి ఇసుక సం చులు వేసి లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఇబ్రహీంపట్నం బొమ్మలమేడిపల్లి చెరువు మత్తడి పొంగి జాతీయ రహదారి-63పె రవాణా స్తంభించింది. మల్లా పూర్ మండలం నడికుడలో గ్రామం లో ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. గొర్రెపెళ్లిలో పెద్ద చెరువు కట్ట తెగి గ్రామం లోకి నీరు వచ్చింది. చిట్టాపూర్ ఊరకుంటకు గండి పడిం ది. జగిత్యాల-నిర్మల్ రహదారి పై రాకపోకలు నిలిచాయి.
కరీంనగర్ జిల్లా చొప్పదండి ఆర్నకొండ పందివాగు పరిధిలో హైవే రోడ్డుపై చెట్టు పడింది. గన్నేరువరం పెద్ద చెరువు వరద తాకిడికి మండల కేంద్రం నుంచి చొక్కారావుపల్లి, కరీంనగర్‌కు రాకపోకలు నిలిచిపోయా యి. గంగాధర మండలంలోని నారాయణపూర్, ఉప్పర మల్యాల, గట్టుభూత్కూర్, కాసారం గ్రామాల చెరువుల మత్తళ్లు దూకుతున్నాయి.
2వేల కోళ్లు మృత్యువాత
కోరుట్ల మండలంలోని అయిలాపూర్ గ్రామానికి చెందిన కాచర్ల మనోహర్ లీజుకు తీసుకుని నడిపిస్తున్న పౌల్ట్రీ ఫామ్‌లో వరద నీరు చేరి 2వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. రూ.3లక్షల నష్టం వాట్లింది.
సురక్షిత ప్రాంతాలకు గోదావరి పరివాహక ప్రజలు
ఎస్సారెస్పీ ప్రాజెక్ట్, కడెం ప్రాజెక్టు నుంచి భారీ ఎత్తున వరద వస్తుండటంతో జగిత్యాల జిల్లాలో దాదాపు 7లక్షల క్యూసెక్కులతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తు న్నది. స్థానికంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మరో లక్ష క్యూసెక్కుల వరద పెరిగే అవకాశం ఉంది. పరివాహక ముంపు ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతా లకు తరలించారు. ధర్మపురి మండలం లో ఇండ్లలోకి గోదావరి వరద నేరు చేరింది.రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎగువ మానేరు, నిమ్మపెళ్లి మూలవాగు ప్రాజెక్టులు మత్తడి దుంకుతున్నాయి. మధ్యమానేరు జలాశయం నీటి సామర్థ్యం 27 టీఎంసీలు కాగా బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు 12 టీఎంసీలకు చేరుకుంది.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మొదటి బైపాస్ రోడ్డు తెగింది. సిరిసిల్ల బైపాస్ రోడ్‌లోని ఎల్లమ్మ టెంపుల్ వద్ద విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. వాగులు పొంగి రోడ్లపై నుంచి ప్రవహిస్తుండటంతో ఆయా మార్గాలు మూసేశారు. పెద్దపల్లి జిల్లాలో 115ఇండ్లు దెబ్బ తిన్నాయి. వాటిలో 69 ఇండ్లు కూలిపోయినట్టు సమాచా రం. 1140 చెరువులు, కుంటలన్నీ పూర్తిగా నిండి మత్తడు లు పారుతున్నాయి. ఓదెల మండలం ఇందుర్తి గ్రామం లోని కంకణాల వాడకు భారీగా వరద నీరు వచ్చి చేరింది.
ఎలిగేడు మండలంలోని శివపల్లి గ్రామంలోని రంగ య్యకుంట కట్ట తెగింది. సుల్తానాబాద్ పెద్ద చెరువు గండిపడి స్వప్న కాలనీలోకి నీరు చేరింది. జిల్లా కేంద్రంలో రాజీవ్‌రహదారిపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. ఆర్ టివో కార్యాలయం నీట మునిగింది. జిల్లా కేంద్రం రంగం పల్లిలో ఓ కుటుంబం వరదలో చిక్కుకోగా.. ఎమ్మెల్యే గజ ఈతగాళ్ల ద్వారా బయటకు తీసుకొచ్చారు. ముత్తారం మం డలం మానేరు నది పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతికి రైతుల పైపు లైన్ల స్టార్టర్ డబ్బాలు కొట్టుకుపోయాయి.
బొగ్గు గనుల్లో 'లేఆఫ్'
గోదావరి నది వరద ఉధృతి పెరగడం వల్ల గోదావరిఖని ఒకటి, మూడు గనులకు మొదటి, రెండు షిఫ్టులలో పనిచేసే కార్మికులకు లే ఆఫ్ ఇస్తున్నట్టు సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. జిడికె1, 3 గనుల లో కార్మికులను పనులు చేయడానికి అనుమతించడం లేదు. గోదావరి ఖని ఓసిపి 3 గని సమీపంలోని జల్లారం వాగు ప్రమాదస్థాయిని మించి ఉధృతంగా ప్రవహిస్తుం డటంతో అత్యవసర ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తు న్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాల వల్ల సింగరేణి సంస్థకు రూ.50కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఓపెన్ కాస్ట్ గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది