Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ చంద్రకాంత్ అగర్వాల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గర్భిణులందరికి హెచ్‌బీఏ 2 పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ సికిల్ సెల్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ చంద్రకాంత్ అగర్వాల్ కోరారు. గురువారం హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో సొసైటీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ యూనిట్, అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్‌ను భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనా యుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రకాంత్ మాట్లాడుతూ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈ పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు రత్నవల్లి కొత్తపల్లి, కార్యదర్శి డాక్టర్ సుమన్ జైన్, జాయింట్ సెక్రెటరీ అలీమ్ బేగ్, కోశాధికారి మనోజ్ రూపానీ తదితరులు పాల్గొన్నారు.