Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు వానలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే రెండ్రోజుల పాటు ఎక్కువ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు, కొన్ని జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన సంచాలకులు కె.నాగరత్న తెలిపారు. ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశమున్న నేపథ్యంలో ఆ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి, అక్కడక్కడా మోస్తరు వర్షం పడొచ్చు. ఆదివారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు రాష్ట్రంలో 600కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. మంచిర్యాల్ జిల్లా బెల్లంపల్లిలో అత్యధికంగా 61.8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. బంగాళాఖాతంలో ఒడిశా - పశ్చిమబెంగాల్ తీరంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగున్నది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నది.