Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు మహంకాళి ఆలయానికి పోటెత్తారు. ఈ నేపథ్యంలో లష్కర్ (సికింద్రాబాద్)కేగాక తెలంగాణకే ప్రత్యేకమైన ఉజ్జయిని మహంకాళి బోనాల విశిష్టతను, ప్రాముఖ్యతను వివరిస్తూ 'తెలుగు ఫోక్' అనే యాప్ పలు గీతాలను రూపొందించి విడుదల చేసింది. జానపద, దైవభక్తి గీతాల రూపకల్పనలో ఇప్పటికే ఈ యాప్ తన ప్రత్యేకతను చాటి చెప్పిన విషయం విదితమే. తాజాదనం, అప్డేట్తో కూడి, మధ్యలో ఎలాంటి ప్రకటనలు, అడ్వర్టైజ్మెంట్ల గొడవ లేకుండా ఈ యాప్ ఉజ్జయిని మహంకాళి బోనాల పాటలను శ్రోతలకు నిరంతరంగా అందిస్తూ వారిని భక్తిపారవశ్యంలో ముంచెత్తుతున్నది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ గాయకులు పాడిన పాటలను, దైవ సంబంధిత గీతాలను ఎప్పటికప్పుడూ జనానికి అందిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్న 'తెలుగు ఫోక్' యాప్‌ను ఇప్పటికే అనేక వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పడు వారందరూ మహంకాళి బోనాల పాటలను వింటూ తన్మయత్వం చెందుతున్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాలు, వాటి పూర్వాపరాలను సామాన్య జనానికి సైతం అర్థమయ్యేలా రూపొందించిన ఈ పాటలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. పలు ఒగ్గు కథల రూపంలో కూడా వీటిని అందించటం ద్వారా ఈ యాప్ ప్రాచీన కళారూపాలకు సైతం జీవం పోయటం అభినందనీ యం. ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా తమ యాప్‌ను డౌన్‌లోన్ చేసుకోవటం ద్వారా దాన్ని ఆదరించి, ఆశీర్వదించాలని నిర్వాహకుల్లో ఒకరైన ప్రకాశ్ శ్రోతలకు విజ్ఞప్తి చేశారు.