Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆపన్న హస్తం అందించండి: టీఎస్ యూటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'వరద బాధితులను ఆదుకుందాం - ఆపన్న హస్తాన్ని అందిద్దామంటూ' తెలం గాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపు నిచ్చింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, గోదావరి వరదల కారణంగా అపార నష్టం జరిగిందని తెలిపారు. ఇండ్లు ముంపునకు గురై వేలాది మంది రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తుల వారు కట్టు బట్టలతో బయటకొచ్చి వరద సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందు తున్నారని వివరించారు. పంటలు, పశువు లు, ఆస్థి నష్టం కోట్ల రూపాయల్లో సంభవిం చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆపన్న హస్తాలను అందించి బాధితులను ఆదుకోవ డం మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు ఉదారం గా స్పందించాలనీ, నగదు, దుస్తులు, వస్తు సామాగ్రిని విరాళంగా ఇవ్వాలని పిలుపు నిచ్చారు. దాతలు టీఎస్‌యూటీఎఫ్ జిల్లా శాఖల ద్వారా లేదా నేరుగా రాష్ట్ర కేంద్రానికి తమ విరాళాలను పంపించాలని కోరారు. ఈ విరాళాలను వీలైనంత త్వరగా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బాధితులకు పంపిణీ చేయటం తెలిపారు.