Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరంలో పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్) కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభ మైంది. ఈ మేరకు పాలిసెట్ ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం తొలిరోజు 4,637 మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించారని తెలిపారు. బుధవారం నుంచి ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 113 పాలిటెక్నిక కాలేజీ ల్లో 26,822 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఇందులో 54 ప్రభుత్వ కాలేజీల్లో 11,892 సీట్లు, ఒక ఎయిడెడ్ కాలేజీలో 230 సీట్లు, 58 ప్రయివేటు కాలేజీల్లో 14,700 సీట్లున్నాయని తెలిపారు. పూర్తి వివరాలకు https://tspolycet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.