Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా దర్బార్ లో గవర్నర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సమస్యలతో సతమతమవుతున్న మహిళలు ఆందోళన చెందొద్దనీ, వారికి తాను అండగా ఉంటానని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ హామీనిచ్చారు. సోమవారం ఆమె రాజ్భవన్లో నిర్వహించిన మహిళా దర్భార్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ బాధలు చెప్పుకుంటూ భోరున విలపించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ...మహిళలు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారనీ, వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు.
అంతే కాకుండా తమ పరిధిలో పరిష్కారానికి అవసరమైన సహాయాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయ సహాయం కోరిన 41 మందికి సెంటర్ ఫర్ ప్రాక్టీసింగ్ లా, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సహకారంతో ఉచిత సహాయం అందిస్తామని గవర్నర్ తెలిపారు. అవసరంలో ఉన్న ముగ్గురు మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.