Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాసర త్రిపుల్ఐటీ వీసీకి మంత్రి సబిత ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రామీణ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక విద్యను అందించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన బాసర త్రిపుల్ఐటీలో చదివే విద్యార్థులకు భవిష్యత్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలని ఆర్జీయూకేటీ ఇన్ఛార్జి వీసీ వి వెంకటరమణను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్లోని మంత్రి కార్యాలయంలో బాసర త్రిపుల్ఐటీలో నెలకొన్న పరిణామాలపై ఆమె సమీక్షించారు. విద్యార్థులకు గతంలో హామీ ఇచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ఇందుకు అవసరమైన నిధులను ఇప్పటికే మంజూరు చేశామని వివరించారు. బోధన, భోజన, వసతి పరంగా భవిష్యత్లో సమస్యలు ఉత్పన్నం కాకుండా విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరారు. విద్యార్థుల సంక్షేమం కోసం అధికారులు తీసుకునే చర్యలకు ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు.