Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్‌ఫ్లో లక్ష 70 వేల క్యూసెక్కులు
- ఔట్‌ఫ్లో లక్ష 75,950 క్యూసెక్కులు
నవతెలంగాణ - ధరూర్
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. 23 గేట్లను ఎత్తారు. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి లక్ష 70 వేల క్యూసెక్కుల నీరు జూరాలకు చేరింది. జలాశయ నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 4.438 టీఎంసీల నీరుంది. 34,635 వేల క్యూసెక్కుల నీటిని ఉపయోగించి యూనిట్లలో 6 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి యథావిధిగా నెట్టెంపాడుకు 1500 క్యూసెక్కులు, భీమా లిఫ్టు-1కు 650 క్యూసెక్కులు, భీమా లిఫ్టు -2కు 0 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 920 క్యూసెక్కులు, కుడి కాల్వకు 210 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 500 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 0 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మొత్తం మీద జూరాల నుంచి దిగువకు లక్ష 75 వేల 959 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్టు పీజేపీ అధికారులు తెలిపారు.