Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చింతకాని
పది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు నిరాశ్రయులైన కుటుంబాలను తక్షణం ఆదుకోవడానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో సోమవారం వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి మడిపల్లి గోపాలరావు మాట్లాడుతూ..
పార్టీ నాగులవంచ గ్రామ శాఖ సహకారంతో గ్రామంలో పలు దుకాణాలు, ఇల్లు తిరిగి విరాళాలు సేకరించినట్టు తెలిపారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో 50 ఏండ్ల కాలంలో ఇలాంటి విపత్తు రాలేదని, ఎందరో ప్రజలు నిరాశ్రయులయ్యారని, దాతలు స్పందించి వరద బాధితులకు విరాళాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు వత్సవాయి జానకి రాములు, తోటకూర వెంకట నరసయ్య, ఆలస్యం రవి, మునుకుంట్ల సుబ్బారావు, కూచిపూడి బుచిబ్బాబు, బల్లి వీరయ్య, ఆళ్ళ మాధవరావు, మడిపల్లి కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.