Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలిరోజు 91.4 శాతం హాజరు
- పరిశీలించిన ఉన్నత విద్యామండలి చైర్మెన్ లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు ఆన్లైన్లో సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఎంసెట్ కన్వీనర్ ఎ గోవర్ధన్ ఒక ప్రకటన విడుదల చేశారు. తొలిరోజు సోమవారం 58,548 మంది అభ్యర్థులకు కేటాయించగా, 53,509 (91.4 శాతం) మంది పరీక్ష రాశారని వివరించారు. ఇందులో తెలంగాణలో 46,571 మందికి కేటాయిస్తే 44,169 (94.8 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. ఏపీలో 11,977 మంది కేటాయించగా, 9,340 (78 శాతం) మంది పరీక్షలు రాశారని తెలిపారు. సోమవారం ఉదయం తొలివిడతలో 28,879 మందికి కేటాయిస్తే, 26,473 (91.7 శాతం) మంది హాజరయ్యారని తెలిపారు. మధ్యాహ్నం రెండో విడతలో 29,669 మందికి కేటాయించగా, 27,036 (91.1 శాతం) మంది అభ్యర్థులు పరీక్ష రాశారని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణ తీరును ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహారెడ్డి, రిజిస్ట్రార్ ఎం మంజూర్ హుస్సేన్, ఎంసెట్ కో కన్వీనర్ ఎం చంద్రమోహన్, కోఆర్డినేటర్ పి శ్వేత పరిశీలించారని వివరించారు. బుధవారం వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం రాతపరీక్షలు ఆన్లైన్లో జరగనున్నాయి.