Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాంగ్రూట్లో వెళ్లి లారీని ఢకొీన్న ఆటో..
- ఆగి ఉన్న లారీని ఢకొీన్న ఘటనలో..
నవతెలంగాణ-మద్నూర్/ముప్కాల్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని జాతీయ రహదారులపై సోమవారం జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ గ్రామంలో మద్నూర్ వైపు నుంచి బిచ్కుంద వైపు 161వ జాతీయ రహదారిపై రాంగ్రూట్లో వెళ్లిన ఆటో అదుపు తప్పింది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తూ ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢకొీట్టింది. వేగం దాటికి 100 ఫీట్ల దూరం వరకు ఆటో దూసుకెళ్లి నుజ్జునుజ్జయింది. దాంతో ఆటోలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ముగ్గురిని పోలీసులు గుర్తించగా.. మరో ఇద్దరి మృతదేహాలు ఛిద్రం కావడంతో గుర్తుపట్టడానికి వీలులేకుండా మారడంతో వారి వివరాలు తెలియలేదు. మృతిచెందిన ముగ్గురు మేనూర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థి కృష్ణ(17), మహారాష్ట్రకు చెందిన భుజన్మహాజన్(35), బోధన్‌కు చెందిన ఆసిఫ్(26)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో కంటైనర్ లారీ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని డీఎస్పీ జైపాల్‌రెడ్డి, బిచ్కుంద సీఐ కృష్ణ, మద్నూర్ ఎస్ఐ శివకుమార్ పరిశీలించారు. ఆటో నుజ్జునుజ్జవడంతో గ్యాస్ కట్టర్ ఉపయోగించి మృతదేహాలను వెలికి తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియాస్పత్రికి తరలించారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కిసాన్ నగర్ 44వ జాతీయ రహదారి బైపాస్ రోడ్డుపై హర్యానాకి చెందిన లారీ టైర్ పంక్చర్ కావడంతో రోడ్డుపైనే నిలిచిపోయింది. లారీ క్లీనర్ టైర్ మారుస్తున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన నాగాలాండ్‌కి చెందిన కంటైనర్ బలంగా ఢకొీంది. దాంతో కంటైనర్ నడుపుతున్న డ్రైవర్ రోబిన్ ఖాన్(25), టైర్ మారుస్తున్న క్లీనర్ రుసుముద్దీన్(20) అక్కడికక్కడే మృతిచెందారు. కంటైనర్ క్లీనర్లు తారిఫ్, ఖుర్షిద్కు తీవ్ర గాయాలు కావడంతో నిర్మల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఆర్మూర్ సీఐ, బాల్కొండ ఎస్ఐ గోపి పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.