Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ మెడికల్ విద్యార్థుల అవస్థలు
- మూడు వైద్యకళాశాలల్లో రద్దయిన సీట్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యా సంవత్సరం మొదలై అంతా చదువుల్లో లీనమై పోగా ఆ విద్యార్థులు మాత్రం తమ భవి ష్యత్తు కోసం ఆందోళన చెందుతూనే ఉన్నారు. అడ్మిషన్లు పూర్తయిన తర్వాత సీట్లను రద్దు చేస్తే అందులో చేరిన విద్యార్థుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. రాష్ట్రంలో వైద్యవిద్యకు సంబం ధించి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే వరకు జరిగిన అడ్మిషన్లలో మూడు ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో చేరిన వారి పరిస్థితి అగమ్య టగోచరంగా తయారైంది. ఎవరో చేసిన తప్పుకు తాము శిక్ష అను భవిస్తున్నట్టుగా తయారైంది. రద్ద యిన సీట్లను తిరిగి పునరుద్ధరిస్తారా? లేదా ఇతర కాలేజీల్లో సూపర్ న్యూమరరీ సీట్లను సృష్టించి వాటిలో సర్దుబాటు చేస్తారా? లేదా ఇంకేదైనా నిర్ణయం జరుగుతుందా? తేలకపోవడంతో నెలల తరబడి వారు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
రాష్ట్రంలో మెడికల్ అడ్మిషన్ల అనంతరం టీఆర్ఆర్, ఎంఎన్ఆర్, మహావీర్ మెడికల్ కాలేజీల్లో నిబంధనల మేరకు అధ్యాపకులు, వసతులు లేవంటూ 450 ఎంబీబీఎస్ సీట్లను, 100కు పైగా పీజీ సీట్లను జాతీయ మెడికల్ కౌన్సిల్ రద్దు చేసిన విషయం విదితమే. ఈ విషయమై రాష్ట్ర హైకోర్టు విచారణ జరిపినప్పటికీ ఆయా కాలేజీల యాజ మాన్యాలు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వద్ద పెట్టుకున్న పిటిషన్ల అంశం తేలే వరకు జోక్యం చేసుకోలేమని తేల్చింది. మే నెలలో సీట్ల రద్దు తర్వాత ఆయా కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు కేంద్రంలోని పెద్దల వద్దకు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఎలాంటి ప్రత్యామ్నాయం చూపించకుండా కేవలం ఎన్ఎంసీ తీసుకునే నిర్ణయం ఆధా రంగా ముందుకెళతామని చెప్ప డాన్ని విద్యార్థులు జీర్ణించు కోలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభు త్వం నుంచి తగిన ప్రతిపాద నలు పంపించకుండా ఎన్ ఎంసీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందని వారు ప్రశ్నిస్తు న్నారు. రాష్ట్రంలో తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఒక ఈఎస్ఐసీ కాలేజీతో కలిపి 19 ప్రయివేట్ నాన్-మైనారిటీ మెడికల్ కాలేజీలు, నాలుగు ప్రయివేటు మైనారిటీ కాలేజీలున్నాయి. ఉస్మానియా, గాంధీ, కాకతీయ ప్రభుత్వ కాలేజీల్లో ఎన్ఎంసీ మార్గదర్శకాల మేరకు 250 సీట్లున్నాయి. వీటిల్లో సీట్లను పెంచే అవకాశం లేదని తెలు స్తున్నది. మరో నాలుగు ప్రభుత్వ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటా కోసం ఇప్పటికే సీట్ల సంఖ్యను పెంచారు. మహబూబ్నగర్ 150 సీట్లుండగా మరో 25, సిద్దిపేట్లో 150 ఉండగా మరో 25, ఆదిలాబాద్ వంద ఉండగా 20, నిజామాబాద్ వంద ఉండగా మరో 20 సీట్లను పెంచారు. ఈ నేపథ్యంలో వీటిలో సీట్లను పెంచేందుకు సరిపడా వసతులు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం సూపర్ న్యూమరరీ సీట్ల కోసం అనుమతి పొందే వీలుందని విద్యార్థులు చెబుతున్నారు. బీహార్ లో ఇదే పరిస్థితి ఎదురైతే అక్కడి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని విద్యార్థులు నష్టపోకుండా సర్దుబాటు చేసిందని గుర్తు చేస్తున్నారు.
కాలేజీల యాజమాన్యాల కోసమే...
రాష్ట్రంలోని ఆయా కాలేజీల యాజమాన్యాలకు మరింత వెసులు బాటును కల్పించే క్రమంలోనే సీట్ల సర్దు బాటుపై కాలయాపన జరుగుతున్నదనే వాదన ఇప్పుడు బలంగా వినపడుతున్నది. ఒకసారి అధ్యా పకులు, వసతులు లేకుండా సీట్ల రద్దుకు కారణమైన యాజమాన్యాలు పదే, పదే అప్పీళ్లకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం సరికాదని నిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.