Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరమ్మతులకు రూ. 38.45 కోట్లు మంజూరు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆర్ అండ్ బీ రహదారులు భారీ దెబ్బతిన్నాయి. కొన్ని రహదారులు పూర్తిగా, మరి కొన్ని పాక్షికంగా మరమ్మతులకు గురయ్యాయి. కాగా ఆ రహదారుల పునరుద్దరణ పనులపై రాష్ట్ర ఆర్అండ్ బీ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. మొత్తం 22 జిల్లాల్లో 515 చోట్ల దెబ్బతిన్నట్టుగా అధికా రులు గుర్తించారు. ఇందులో 217 చోట్ల చోట్ల రహదారులు తెగిపో యాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్రంగా అంతరాయం కలిగింది. వర్షాలకు దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మత్తులు చేయాలని ముఖ్య మంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశించడంతో రోడ్లు, భవనాల శాఖ ఉన్న తాధికారులు యుద్ధ ప్రాతిపదికపైన తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ట్రాఫిక్ పునరుద్దరించారు. మంగళవారం వరకు 68 చోట్ల తాత్కాలిక మరమ్మతులు చేపట్టినట్టు అధికారిక సమాచారం. 515 చోట్ల దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణ కోసం తాత్కాలిక మరమ్మతు లు చేయడానికి రూ. 38.45 కోట్లు ఖర్చవుతుందని అధికా రుల అంచనా. ఈ మేరకు రోడ్ల నిర్వహణకు కేటాయించిన నిధులనే వినియోగించినట్టు తెలిసింది. మరో వారం రోజుల్లో ట్రాఫిక్ పునరుద్ధరణ చర్యలు దాదాపుగా పూర్తవు తాయని అధికారులు చెప్పారు. ఇది లావుండగా మళ్ళీ పూర్తి స్థాయిలో అధికారులు క్షేత్ర స్థాయి పర్యటన చేపట్టి ఎక్కడైనా శాశ్వతంగా చేపట్టాల్సిన పనులపై ప్రణాళికలు రూపొ ందించనున్నట్టు సమాచారం. దీనిపై రోడ్లు, భవనాల శాఖ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది.