Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'నేను ముమ్మాటికీ భారతీయుడినే' అని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. 'నేను ప్రతి సంవత్సరం మూడు, నాలుగు సార్లు నా కుటుంబ బాగోగుల కోసం జర్మనీ వెళ్లిరావడం జరుగుతుంది.
2009 నుంచి నన్ను గెలిపిస్తున్న నియోజకవర్గ ప్రజలందరికీ ఈ సంగతి తెలుసు. నాకు జరుగుతున్న వైద్య చికిత్స కారణంగా రాష్ట్రపతి ఎన్నికలో ఓటింగ్లో పాల్గొనలేదు. ముందుగానే ఈ విషయాన్ని మా పార్టీకి, అసెంబ్లీ కార్యదర్శికి సమాచారం ఇచ్చాను. నాకు భారతదేశంలోగానీ, జర్మనీలోగానీ ఎలాంటి వ్యాపారాలు లేవు. నాకు ఈ ప్రాంతంతో సామాజిక పేగుబంధం ఉన్నది కనుకనే రాజకీయాల్లోకి వచ్చాను. నేను ముమ్మాటికీ భారతీయుడినే. ఈ అంశంపై గతంలోనే హైకోర్టు, సుప్రీం కోర్టులు తీర్పులిచ్చాయి. ప్రజాక్షేత్రంలో వరుసగా నాలుగుసార్లు ఓటమి చెందినవారే నిరాశ, నిస్పృలతో కోర్టులచుట్టూ తిరుగుతున్నరు' అని పేర్కొన్నారు.