Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్విట్ చేసిన కేంద్రమంత్రి గడ్కరీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
పూణే-హైదరాబాద్ (ఎన్‌హెచ్-65) సెక్షన్లో బీహెచ్ఈఎల్ జంక్షన్లో 1.65 కిలోమీటర్ల ఫ్లైఓవర్ మంజూరైంది. ఇందుకు రూ.130.65 కోట్ల నిధులను ఇస్తున్నట్టు కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్టుకు ఈ ఏడాది ఏప్రిల్ 29న శంషాబాద్‌లో నితిన్ గడ్కరీ శంకుస్ధాపన చేసిన విషయం తెలిసిందే. గత కొన్నేండ్లుగా ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. తాజాగా ఈ ప్రాజెక్టును కేంద్రం మంజూరు చేసింది. హైదరాబాద్ నుంచి జహీరాబాద్, నాగ్‌పూర్, పూణేలోని ఇండిస్టీయల్ కారిడార్‌కు నిత్యం వేల సంఖ్యలో గూడ్స్ పాటు సాధారణ వాహనాలూ వెళుతుండటంతో బీహెచ్ఈఎల్ దగ్గర తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో ఆ సమస్య తగ్గుతుందని మంత్రి తెలిపారు.