Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు
- డీవైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా బడులు, జూనియర్ కాలేజీల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌ను జయప్రదం చేయాలని విద్యార్థులు, విద్యాసంస్థల యాజమాన్యాలను ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్వో, పీడీఎస్‌యూ, పీడీఎస్‌యూ, ఏఐపీఎస్యూ, ఏఐఎస్బీ, ఏఐఎఫ్డీఎస్ కోరాయి. నూతన జాతీయ విద్యావిధానాన్ని (ఎన్ఈపీ-2020) రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న పాఠ్యపుస్తకాలను అందించాలని కోరాయి. విద్యార్థులందరికీ సకాలంలో యూనిఫారాలు ఇవ్వాలని తెలిపాయి. మధ్యాహ్న భోజనానికి నిధులు పెంచి, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఎంఈవో, డిప్యూటీఈవో పోస్టులను భర్తీ చేయాలని కోరాయి. ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులను అరికట్టాలనీ, నియంత్రించేందుకు చట్టం తేవాలని పేర్కొన్నాయి. జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని తెలిపాయి. వాటిలో మౌలిక వసతులు మెరుగుపర్చి ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశాయి. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరాయి. వామపక్ష విద్యార్థి సంఘాలు బుధవారం తలపెట్టిన విద్యాసంస్థల బంద్‌కు డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ బంద్‌లో పాల్గొనాలని విద్యార్థులు, యువకులకు పిలుపునిచ్చారు.