Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టు 1న ఈసెట్
- 2 నుంచి 5 వరకు పీజీఈసెట్
- రాతపరీక్షల షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా వాయిదా పడిన ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం రాతపరీక్షలు ఈనెల 30, 31 తేదీల్లో జరగనున్నాయి. వచ్చేనెల ఒకటిన ఈసెట్, రెండు నుంచి ఐదో తేదీ వరకు పీజీఈసెట్ రాతపరీక్షలను నిర్వహిస్తారు. కాగా ఈనెల 13, 14, 15 తేదీల్లో జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంతోపాటు ఈసెట్ ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ పరీక్షల తేదీల షెడ్యూల్ను ఖరారు చేస్తూ ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 30, 31 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం, వచ్చేనెల ఒకటిన ఈసెట్, రెండు నుంచి ఐదో తేదీ వరకు పీజీఈసెట్ రాత పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షల తేదీల్లో మార్పులను అభ్యర్థులు గమనించాలని కోరారు. ఆయా వెబ్సైట్ల నుంచి సంబంధిత ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ హాల్టికెట్లను త్వరలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.