Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్నాటకకు చెందిన నలుగురు అరెస్ట్
- రెండు కార్లు స్వాధీనం
- వివరాలు వెల్లడించి ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-సూర్యాపేట
ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిస్తున్న 325కిలోల గంజాయిని పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఎస్పీ రాజేంద్రప్రసాద్ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నేరెడుచర్ల పీఎస్ పరిధి చిల్లకల్లు బ్రిడ్జి వద్ద నేరేడుచర్ల ఎస్ఐ నవీన్, మఠంపల్లి ఎస్ఐ రవి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన కారులో 85 కిలోల గంజాయి లభ్యమైంది. నిందితులు ప్రహ్లాద్సాV్‌ా, అమితసింగ్ ఢిల్లీ నుంచి ఈనెల 10వ తేదీ బయల్దేరి 13వ తేదీన ఏపీలోని అనకాపల్లికి చేరుకున్నారు. అక్కడ మూడో నిందితుడు సందీప్‌కుమార్ చెప్పిన ప్రకారంగా జాన్బాబా, భాస్కర్‌ను కలిసి అక్కడే మూడ్రోజులు ఉన్నారు. వారి వద్ద 85 కిలోల గంజాయిని కొనుగోలు చేసి 16వ తేదీన బయల్దేరి ఢిల్లీకి చెందిన సందీప్‌కుమార్‌కు అప్పగించేందుకు వెళ్తుండగా మార్గమధ్యలో రామాపురం చెక్‌పోస్టు వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద గంజాయితో పాటు కారు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జాన్‌బాబు, భాస్కర్, సందీప్‌కుమార్ పరారీలో ఉన్నారు.
అదేవిధంగా, గరిడేపల్లి పీఎస్ పరిధిలోని పొనుగోడు గ్రామం వద్ద ఎస్ఐలు కొండల్‌రెడ్డి, సైదులు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలో కర్నాటక కారును ఆపారు. 240 కిలోల గంజాయిని గుర్తించారు. నిందితులు పూజారి పవన్, సోని సునీత కర్నాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం వెళ్లాడు. మల్లేశ్ అనే వ్యక్తిని కలిశారు. అతను చెప్పిన ప్రకారంగా మోహన్ నుంచి 240 కిలోల గంజాయిని కొనుగోలు చేసి జహీరాబాద్‌లో మల్లేశ్‌కు అప్పగించుటకు బయల్దేరారు. రామాపురం చెక్‌పోస్టుకు కొద్ది దూరం వచ్చి ఓ నిర్మాన్యుష ప్రదేశంలో రెండ్రోజులు ఉండి మంగళవారం గరిడేపల్లి గ్రామ శివారులోని పొనుగోడు క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలో పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితులు కర్నాటకకు చెందిన మల్లేష్, ఏపీకి చెందిన మోహన్, మహారాష్ట్ర్రకు చెందిన పాటిల్ పరారీలో ఉన్నారు. గంజాయిని పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ క్యాష్ రివార్డుతో అభినందించారు. ఈ సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, సీఐల రామలింగారెడ్డి, శ్రీనివాస్, రవి, ఆర్ఐలు, ఎస్ఐలు నవీన్, కొండల్‌రెడ్డి, సైదులు, రవి పాల్గొన్నారు.