Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటల్ పెన్షన్ యోజనతో సామాజిక భద్రత : ఎస్బిఐ జిఎం వెల్లడి
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు అటల్ పెన్షన్ యోజన (ఎపివై)లో 4.30 కోట్ల మంది సభ్యత్వాన్ని పొందారని పెన్షన్ ఫండ్ రెగ్యూలేటరీ అథారిటీ (పిఎఫ్ఆర్డిఎ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎజి దాస్ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో ఎపివైపై ఎస్ఎల్బిసి సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసంఘటిత రంగంలోని వారికి ఈ పథకం చాలా ప్రయోజనకరమన్నారు. ఈ పథకంలో 18- 40 ఏళ్ల లోపు చేరవచ్చన్నారు. ఆ తర్వాత 60 ఏళ్లు దాటిన వారు ఈ స్కీమ్‌లో ఏడాదికి రూ.1,000 నుంచి రూ.5,000 పెన్షన్ పొందడానికి వీలుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎపివైలో 13.19 లక్షల మంది చేరారని వెల్లడించారు. ఎస్బిఐ జనరల్ మేనేజర్, ఎస్ఎల్బిసి కన్వీనర్ దేబాశిష్ మిశ్రా మాట్లాడుతూ సామాజిక భద్రత కల్పించడమే ఎపివై లక్ష్యమన్నారు. ఇది వృద్యాప్య అవసరాలను తీర్చనుందన్నారు.