Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆశాల సేవలను డబ్య్లూహెచ్ఓ గుర్తించినా.. పట్టించుకోని ప్రభుత్వాలు: ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి
నవతెలంగాణ-కంది
ఆశా వర్కర్లపై పని ఒత్తిడి పెరిగి పిట్టల్లా రాలిపోతున్నారని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. యూనియన్ సంగారెడ్డి జిల్లా మూడో మహాసభలు స్థానిక కేవల్ కిషన్ భవన్లో మంగళవారం నిర్వహించారు. ఈ మహాసభను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఆశా వర్కర్లు ప్రజలకందించిన సేవలను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పెట్టుబడిదారులు, కార్పొరేట్లకు మాత్రం రూ.లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్నారని ఆరోపించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆశాలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో రూ.10 వేలు ఫిక్స్డ్ వేతనం ఇస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ తదితర చట్టబద్ధ సౌకర్యాలు లేవని వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల హక్కులు సాధించుకోవాలంటే పోరాటం తప్పా మరో మార్గం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆశా వర్కర్స్ యూనియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. గౌరవ అధ్యక్షులుగా జి సాయిలు, అధ్యక్షులుగా వరలక్ష్మి, కార్యదర్శి యశోద, ఉపాధ్యక్షులుగా వీరమని, ప్రశాంతి, శశిరేఖ, సహాయ కార్యదర్శులుగా వనిజ, శిరీష, నందమ్మ, విట్టబాయి, కమిటీ సభ్యులుగా అంజమ్మ, జ్యోతి, గంగ, లక్ష్మి, గీత, నాగమణి భారతి, లక్ష్మీనరసింహ, మౌనిక ఎన్ని కయ్యారు.సీఐటీయూ జిల్లా కోశాధికారి జి సాయిలు, ఆశా యూనియన్ నాయకులు వరలక్ష్మి, వీరమని, ప్రశాంతి, యశోద, శశి కళ, శిరీష, వనజ, శశిరేఖ, భారతి, ప్రసన్న, రాణి, నందమ్మ పాల్గొన్నారు.